![]()
- వైద్య సేవలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక సమీక్ష
గుండాల, మన భద్రాద్రి న్యూస్, మే 20:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ బుధవారం గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆస్పత్రి పరిసరాల పారిశుద్ధ్య నిర్వహణను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి రికార్డులు, ఔషధాల నిల్వలు, రోగుల సేవల నిర్వహణ విధానాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం కాయకల్ప కార్యక్రమంలో భాగంగా శెట్టిపల్లి, సాయనపల్లి, ముత్తాపురం సబ్ సెంటర్లను సందర్శించి అక్కడి మౌలిక వసతులు, నిర్వహణ పరిస్థితులను పరిశీలించారు. సబ్ సెంటర్లలో రికార్డులను సక్రమంగా నిర్వహించడంతో పాటు ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ సుదీప్ కు సూచించారు. అలాగే ఎన్క్వాస్ గుర్తింపు కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎంపిక కావాలంటే ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని, సేవల నాణ్యత పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ వి భూలక్ష్మి తో పాటు పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.







