![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, జూన్ 10:
లెర్నింగ్ కర్వ్ లైఫ్ స్కిల్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఆంగ్ల భాషా నైపుణ్యాల అభివృద్ది కార్యక్రమాన్ని అమలు చేయడానికి మహిళా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ నియామక ప్రక్రియ చేపట్టినట్లు సంస్థ ప్రతినిధులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టుకు అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలని, ఆంగ్ల భాషపై పట్టు, మంచి కమ్యూనికేషన్ సామర్థ్యం కలిగి ఉండాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే ఆసక్తి, ఉపాధ్యాయ అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ రెజ్యూమేను tulasi@learning-curve.co.in, pranitha@learning-curve.co.in అనే ఈమెయిల్ ద్వారా పంపించాలని సూచించారు. పూర్తి వివరాలకు 9032188825 నెంబర్ను సంప్రదించాలని జిల్లా కోఆర్డినేటర్ తెలిపారు.







