![]()
రూ.3.50 కోట్ల విలువైన గంజాయిని దహనం చేసిన ఎక్సైజ్ శాఖ
- నాలుగు ఎక్సైజ్ స్టేషన్లలో స్వాధీనం చేసుకున్న 696.1 కిలోల గంజాయి కాల్చివేత
కొత్తగూడెం, మన భద్రాద్రి న్యూస్
ఖమ్మం డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాలుగు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.3.50 కోట్ల విలువైన 696.1 కిలోల గంజాయిని గురువారం దహనం చేశారు.
కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్లో స్వాధీనం చేసుకున్న 316.07 కిలోలు, భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్లోని 329.51 కిలోలు, పాల్వంచ ఎక్సైజ్ స్టేషన్లోని 43.62 కిలోలు, మణుగూరు ఎక్సైజ్ స్టేషన్లోని 6.9 కిలోల గంజాయిని ప్రభుత్వ అనుమతి పొందిన గంజాయి నిర్మూలన కేంద్రంలో దహనం చేశారు.
నాలుగు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం 32 కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని ఖమ్మం డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది సమక్షంలో నిబంధనల ప్రకారం దహనం చేశారు.








