![]()
- విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచన
భద్రాచలం, మన భద్రాద్రి న్యూస్
భద్రాచలం – కూనవరం రోడ్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రంథాలయంలో తెలంగాణ ప్రభుత్వం అందించిన పుస్తకాలు, పాఠ్యపుస్తకాలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గురువారం విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యసాధన కోసం కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థి దశలో విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి సర్వతోముఖ అభివృద్ధి సాధించాలని సూచించారు. ప్రభుత్వం విద్యా రంగానికి ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తీసుకువస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి. రత్నకుమార్, వంశీ నాయక్, ఏ. వెంకటేశ్వరరావు, డి. సుధాకర్ రెడ్డి, గరుడాచలం, సంపత్ కుమార్, శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, నర్రా రాము, భీమవరపు వెంకటరెడ్డి, చింతాడి చిట్టిబాబు, కొప్పుల శ్రీను, యువ నాయకులు గాడి విజయ్, ఎండి సుభాని, గాడి రాజేష్, మాచినేని భాను, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.








