![]()
19 జూన్ కరకగూడెం మండలం మన భద్రాద్రి న్యూస్ : పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కరకగూడెం మండలానికి చెందిన 23 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.11,27,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటోందన్నారు. ప్రజల అవసరాల సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తూ, వైద్య ఖర్చులు మరియు ఇతర అత్యవసర అవసరాలకు సహాయం అందిస్తోందని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో యువత, రైతులు, పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం రాహుల్ గాంధీ నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేస్తున్న పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు
ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఎర్ర సురేష్, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాగబండి వెంకటేశ్వర్లు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు చౌలం కేశవరావు, మాజీ సర్పంచ్ తోలెం నాగేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే కరకగూడెం సర్పంచ్ పోలేబోయిన సుజాత, రేగళ్ల సర్పంచ్ బాడిశ పార్వతి, పద్మాపురం సర్పంచ్ తోలెం రమేష్, చొప్పాల సర్పంచ్ తోలెం సావిత్రి, గొల్లగూడెం సర్పంచ్ ఏళ్లబోయిన ముత్తమ్మ, కొత్తగూడెం సర్పంచ్ ఎర్రం పొట్టయ్య, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు, అభిమానులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.







