![]()
వీరాపురం ఇసుక ర్యాంపును చుట్టుముట్టిన గోదావరి వరద
- రాంపులో 50 మంది చిక్కుకున్నట్లు సమాచారం..?
- రంగంలోకి దిగిన రెస్క్యూ టీం సురక్షితంగా ఒడ్డుకు తరలింపు
- లారీలు వదిలిపెట్టమని డ్రైవర్ల మొండిపట్టు
చర్ల మన భద్రాద్రి న్యూస్, జులై 31: చర్ల మండల పరిధిలోని వీరాపురం గ్రామం సమీపంలో గోదావరిలో ఒక్కసారిగా వరద పెరగడంతో ఇసుక ర్యాంపు వద్ద పనిచేస్తున్న సుమారు 50 మంది చిక్కుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.స్థానికుల సమాచారం ప్రకారం, ఇసుక ర్యాంపు పనులకు వెళ్లిన కార్మికులతో పాటు ఇసుక లోడింగ్ కోసం వచ్చిన లారీ డ్రైవర్లు కూడా గోదావరిలో చిక్కుకున్నారు. మొత్తం సంఖ్య దాదాపు 50 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది.విషయం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. అయితే రెస్క్యూ కార్యక్రమంలో అధికారులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.తమ లారీలను వదిలి రావడానికి డ్రైవర్లు నిరాకరిస్తున్నట్లు సమాచారం.లారీలు వదిలి మేము రాము అంటూ వారు మొండికేస్తున్నారని స్థానికులు తెలిపారు. వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో అందరినీ సురక్షితంగా తరలించడంపై అధికారులు దృష్టి సారించారు.ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చిక్కుకున్న వారందరినీ క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.








