![]()
మీ సేవ, ఆధార్ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీ
– ప్రభుత్వం నిర్దేశించిన రుసుములనే వసూలు చేయాలి: ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు
చర్ల, మన భద్రాద్రి న్యూస్, సెప్టెంబర్ 22
చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని మీ సేవ, ఆధార్ కేంద్రాలను ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో టీజీటీఎస్ జిల్లా మేనేజర్ కూడా పాల్గొన్నారు.
కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న సేవలు, నిర్ణీత సమయపాలన, ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన రుసుములనే ప్రజల నుంచి వసూలు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అదనపు రుసుములు వసూలు చేయరాదని నిర్వాహకులకు స్పష్టం చేశారు.
కేంద్రాలకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, అవసరమైన సేవలను సకాలంలో, సక్రమంగా అందించాలని సూచించారు. నిర్ణీత పని వేళలను తప్పనిసరిగా పాటించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.
పారదర్శకంగా, వేగవంతంగా, నాణ్యమైన సేవలు అందించేలా కేంద్రాలను నిర్వహించాలని సైదేశ్వరరావు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు.








