![]()
ఆపదలో అండగా సీఎం రిలీఫ్ ఫండ్ — లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
26-09-2026
భద్రాచలం నియోజకవర్గం
భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
దుమ్ముగూడెం మండలానికి చెందిన చిన్న నల్లబల్లి గ్రామం పానుగంటి లక్ష్మీ భవానికి రూ.27,000 విలువైన చెక్కును, పెద్ద నల్లబల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి వెంకన్నకు రూ.54,500 విలువైన చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆపద సమయంలో ప్రభుత్వం అందించే సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక సహాయాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. అనారోగ్యం, వైద్య ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రత్నం రమాకాంత్, భీమవరపు వెంకటరెడ్డి, చేగొండి శ్రీనివాస్, చింతాడి రామకృష్ణ, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ గాడి విజయ్ తదితరులు పాల్గొన్నారు.








