![]()
ఎఫ్ఎల్ఎన్తో శ్వాస పీల్చాలి.. ఎఫ్ఎల్ఎన్తో శ్వాస వదలాలి
– విద్యార్థి కేంద్రంగా ప్రాథమిక విద్యా బోధన ఉండాలి : ఎంఈఓ బెక్కంటి శ్రీనివాసరావు
భద్రాచలం, మన భద్రాద్రి న్యూస్
ప్రాథమిక స్థాయిలో విద్యార్థులను కేంద్రంగా చేసుకుని ఎఫ్ఎల్ఎన్ ఆధారంగా నాణ్యమైన విద్యాబోధన అందించాలని భద్రాచలం మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు ఉపాధ్యాయులకు సూచించారు.
మంగళవారం భద్రాచలం మండల వనరుల కేంద్రంలో ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక, కేజీబీవీ, ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పెంపొందించే విధానాలపై ప్రధానోపాధ్యాయులకు సుమారు రెండు గంటలపాటు శిక్షణ ఇచ్చారు.
బుధ, గురువారాల్లో నిర్వహించనున్న కాంప్లెక్స్ స్థాయి సమావేశాల్లో చర్చించాల్సిన, బోధించాల్సిన అంశాలపై కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు సూచనలు చేశారు.
*అత్యధిక నమోదు సాధించిన ప్రధానోపాధ్యాయులకు సన్మానం*
ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక విద్యార్థుల నమోదు సాధించిన జాన్సన్, టీ. రమా, రాజా శ్రీనివాస్, పాపయ్య ప్రధానోపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో సీఆర్పీలు గోపి, ఆర్కే, సీసీ బేబీ, ఐఈఆర్పీ ఎస్. పద్మ, ఏపీఎం తదితరులు పాల్గొన్నారు.








