![]()
ఐటీడీఏ నివాస గృహాల్లో ఘనంగా అన్నదానం
– వరసిద్ధి వినాయకుని మండపంలో అన్నదానాన్ని ప్రారంభించిన ఐటీడీఏ పీఓ బి. రాహుల్
భద్రాచలం, మన భద్రాద్రి న్యూస్, సెప్టెంబర్ 22
హిందువులు ఏ శుభకార్యం తలపెట్టినా మొట్టమొదటగా పూజించేది విఘ్నేశ్వరుడినేనని, తొలి పూజలు అందుకునే వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
మంగళవారం ఐటీడీఏ కార్యాలయ ఉద్యోగుల నివాస సముదాయంలో వరసిద్ధి వినాయక గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు భక్తమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా తన కుమారుడు అదృత్ హావన్తో కలిసి వరసిద్ధి వినాయకునికి పూజలు నిర్వహించి, భక్తులకు భోజనాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, అందరూ భక్తిభావంతో కలిసిమెలిసి ఉండేలా, కులమతాలకు తావులేకుండా ఉండడం కోసమే పండుగలు నిర్వహిస్తామని అన్నారు. తొమ్మిది రోజులపాటు విశేష పూజలతో పాటు చిన్నారుల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని నివాస సముదాయాన్ని సందడిగా మార్చిన మహిళలు, చిన్నారులను అభినందించారు.
ఐటీడీఏ అధికారులు, సిబ్బంది ఐకమత్యంతో ఉండటం వల్లే ఇటువంటి కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయని, ముఖ్యంగా మహిళా ఉద్యోగులను అభినందించాల్సి ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి చందన, ఆర్సీఓ గురుకులం అరుణకుమారి, ఏటీడీవోలు చంద్రమోహన్, రాధమ్మతో పాటు ఐటీడీఏలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








