![]()
పెద్దకర్మలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకుడు సోయం వీరభద్రం
దమ్మపేట మండల పరిధిలోని నాయిడుపేట గ్రామంలో సీపీఎం పార్టీ మండల సీనియర్ నాయకుడు దొడ్డా లక్ష్మీనారాయణ మాతృమూర్తి దొడ్డా సత్యవతి పెద్దకర్మ కార్యక్రమానికి బి.ఆర్.ఎస్. పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా దొడ్డా సత్యవతి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం దొడ్డా లక్ష్మీనారాయణ, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని మనోధైర్యం నింపారు.
ఈ కార్యక్రమంలో రాచురుపల్లి మాజీ సర్పంచ్ తోట రాజు, కీసరి మల్లికార్జునరావు, ఊకే నరసింహరావు, సోయం వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు.








