![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, ఆగస్టు 11:
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పూర్వ విద్యార్థులు పిలుపునిచ్చారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గుండాల మండలంలోని ఎంపిపిఎస్ పాఠశాలలో 1998–99 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థుల కోసం వాటర్ క్యాన్లను వితరణ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి సౌకర్యం మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు సమాజానికి ఎంతో కీలకమైనవని, వాటి అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు భాగస్వాములు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. రమేష్, ఉపాధ్యాయులు శరత్ బాబు, ప్రమీల, వెన్నెల, శకుంతల, పూర్వ విద్యార్థులు అబ్దుల్ ఖైసర్, గుండెబోయిన లక్ష్మీనారాయణ, వాంకుడోతు జగన్, సనప శ్రీనివాసరావు, మొక్క శంకర్, మొక్క సంతోష్, నవతెలంగాణ విలేఖరి తవిడిశెట్టి రాంబాబు, బీజేపీ మండల అధ్యక్షుడు సోలం సతీష్, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.








