![]()
తేదీ: 13-06-2026ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం,
మణుగూరు మండలం మనభద్రాద్రి న్యూస్
పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్సల సమయంలో ఆర్థికంగా అండగా నిలిచే ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అల్లపల్లి మండలం కర్నెగూడెం గ్రామానికి చెందిన కోరం నాగేశ్వరరావుకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ వైద్య సేవలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరంతరం సహాయం అందిస్తోందన్నారు. ఈ పథకం నిరుపేద కుటుంబాలకు గొప్ప భరోసాగా నిలుస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.








