![]()
తేదీ: 19-06-2026 కరకగూడెం మండలం మన భద్రాద్రి న్యూస్
పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు*తాటిగూడెం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చందా నాగేశ్వరరావును ఆయన నివాసంలో పరామర్శించారు. నెల రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన చందా నాగేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అడిగి తెలుసుకుని, ప్రస్తుతం ఆయన కోలుకుంటుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు* మాట్లాడుతూ, పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తల సంక్షేమం పట్ల తాను ఎల్లప్పుడూ శ్రద్ధ చూపుతానని తెలిపారు. త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని తిరిగి ప్రజా సేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే, అవసరమైన సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఎర్ర సురేష్, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాగబండి వెంకటేశ్వర్లు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు చౌలం కేశవరావు, మాజీ సర్పంచ్ తోలెం నాగేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే కరకగూడెం సర్పంచ్ పోలేబోయిన సుజాత, రేగళ్ల సర్పంచ్ బాడిశ పార్వతి, పద్మాపురం సర్పంచ్ తోలెం రమేష్, చొప్పాల సర్పంచ్ తోలెం సావిత్రి, గొల్లగూడెం సర్పంచ్ ఏళ్లబోయిన ముత్తమ్మ, కొత్తగూడెం సర్పంచ్ ఎర్రం పొట్టయ్య, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు, అభిమానులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.








