![]()
భద్రాచలంలో మౌనదీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
అయోధ్య రామ మందిరం అంశంపై సీబీఐ విచారణకు డిమాండ్
భద్రాచలం, మన భద్రాద్రి న్యూస్, జూలై 13:
అయోధ్య శ్రీరామ మందిరంలో అవినీతి ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించి, నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం సమీపంలో సోమవారం మౌనదీక్ష చేపట్టారు.
ఈ మౌనదీక్షకు సంఘీభావం తెలుపుతూ భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వి. హనుమంతరావు మాట్లాడుతూ, అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణానికి సంబంధించి వస్తున్న అవినీతి ఆరోపణలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే అంశాలపై పూర్తి పారదర్శకత అవసరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ, ఉపసర్పంచ్ రత్నం కవిత, వార్డు సభ్యులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.








