![]()
చర్ల మండల పరిధిలోని పుసుగుప్పకు వెళ్లే రహదారిలో రోటెంత వాగు వద్ద ఇటీవల నిర్మించిన బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు భారీ వర్షాలకు దెబ్బ తినడంతో ఆ రహదారిపై భారీ వాహనాల రాకపోకలను నిషేధించడమైనదని చర్ల సిఐ రాజు వర్మ గురువారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు..గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వంతెనకు అనుసంధానంగా ఉన్న రోడ్డు దెబ్బతినడంతో ఆ మార్గంలో రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. దీంతో చర్ల పోలీసు శాఖ వెంటనే స్పందించింది.ఈ రహదారి వెంట తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు సీఐ ఏ. రాజు వర్మ తెలిపారు.అటుగా ప్రయాణించే గ్రామస్తులు కూడా అత్యంత జాగ్రత్తలు పాటించాలని,వర్షాల కారణంగా రోడ్లు జారుడుగా ఉన్నాయని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.రహదారి మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని సీఐ కోరారు.








