![]()
మణుగూరులో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం
- పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి
- ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్ర
మణుగూరు, జూన్ 15 (మన భద్రాద్రి న్యూస్)
మణుగూరు మండలంలోని హనుమాన్ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్ర, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తుంచుకుంటుందని అన్నారు. కార్యకర్తల అండదండలతోనే బీఆర్ఎస్ పార్టీ బలోపేతమైందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్ర మాట్లాడుతూ, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి నాయకుడు, కార్యకర్త చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో నిర్వహించే ఎస్ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) కార్యక్రమంలో ప్రజలు తమ ఓటరు వివరాలను సరిచూసుకొని నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మాజీ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, అల్లపల్లి ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి, పీఏసీఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ, జలగం జగదీష్, గోనెల నాని, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








