![]()
భద్రాచలం పట్టణంలోని చిన్న స్వామీజీ మఠం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రామాలయంలో నియమితులైన అర్చకులు, ఆలయ సిబ్బందిని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సోమవారం శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో అర్చకులు, ఆలయ సిబ్బంది నిబద్ధతతో సేవలందించాలని ఆకాంక్షించారు. భక్తులకు ఆధ్యాత్మిక సేవలు మరింత మెరుగ్గా అందేలా కృషి చేయాలని సూచించారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావును శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.








