![]()
డబ్బులు ఇస్తే ఇల్లు మంజూరు చేయిస్తా అనే వారిని నమ్మకండి
అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తుంది..
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ నాయుడు
చర్ల,మన భద్రాద్రి న్యూస్,జూన్ 9 : ఇందిరమ్మ ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేసే దళారులు లేదా బ్రోకర్లను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ అధికారిక ప్రక్రియ ద్వారా మాత్రమే అర్హులను గుర్తిస్తారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పేరుతో ప్రజలను మోసం చేసే దళారులను నమ్మి ఎవరు డబ్బులు చెల్లించవద్దని,అలాంటి వారి మాటలు విని మోసపోవద్దని అన్నారు. అధికారులమని లేదా నాయకులమని చెప్పి ఇల్లు ఇప్పిస్తామంటూ డబ్బులు అడిగే వారిని నమ్మవద్దని లబ్ధిదారుల ఎంపిక పాదర్శకంగా ప్రభుత్వ అధికారిక ప్రక్రియ ద్వారా మాత్రమే గుర్తిస్తారని అన్నారు. ఎవరైనా ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేస్తే వారిని నమ్మకుండా స్థానిక పోలీసులను గాని రెవెన్యూ అధికారులను గాని సంప్రదించాలని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని విజయ నాయుడు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిజమైన లబ్ధిదారులు లబ్ది చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని,ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.








