![]()
టియుడబ్ల్యుజే ఐజేయు మండల కమిటీ సభ్యుల సమావేశం..!
- మండల అధ్యక్షుదిగా చాపలమడుగు నరసింహారావు ఏకగ్రీవం
జూలూరుపాడు, మన భద్రాద్రి న్యూస్, మే 28
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల టియుడబ్ల్యూజే (ఐజేయు) నూతన మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఏవిఆర్ ఫంక్షన్ హాలులో గురువారం సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో మండల నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా చాపలమడుగు నరసింహారావు, ఉపాధ్యక్షులు బాదావత్ హథీరాం, ప్రధాన కార్యదర్శి సంఘం నాగరాజు, సహాయ కార్యదర్శి ఎస్కే బుడెన్ పాషా, కోశాధికారిగా అన్నవరపు జశ్వంత్, ప్రచార కార్యదర్శి రత్న కుమార్, కమిటీ సభ్యులు గా కాసిమల్ల సురేష్, తంబర్ల నరసింహారావు, ఎస్కే సమీర్ ను ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమంలో అధ్యక్షులు సిహెచ్ నరసింహారావు మాట్లాడుతూ 70 సంవత్సరాల నుండి ఉన్నటువంటి టియుడబ్ల్యూజే ఐజేయు కమిటీలో మండల అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం చాలా గౌరవంగా ఉందని ఆయన అన్నారు అదేవిధంగా మండలంలో మా యూనియన్ లో ఉన్న ప్రతి సభ్యులకి వృత్తిపరంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తక్షణమే స్పందిస్తూ మా కమిటీ సభ్యుల పక్షాన న్యాయం ఉంటే ఎంత దూరమైనా పోరాటానికి సిద్ధంగా ఉంటానని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో. సీనియర్ జర్నలిస్ట్ మిత్రులు. సీనియర్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కొలిపాక చంద్ర శేఖర్, మోదుగు ప్రభాకర్, మోదుగు ఆదాము, ఐజెయు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియాలో సభ్యులు తంబర్ల పుల్లారావు, బాపట్ల మురళి, ఆరెబోయిన కృష్ణ ప్రసాద్, బూరం రమేష్, కంచపోగు నరసింహారావు, మంద లక్ష్మి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.








