![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, జూలై 29:
గుండాల గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం రెయిన్ జాకెట్లు, రెయిన్ క్యాప్స్ పంపిణీ చేశారు. వర్షాకాలంలోనూ ఎలాంటి ఇబ్బందులు లెక్కచేయకుండా గ్రామ పరిశుభ్రత కోసం విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. వారి సేవలను గుర్తించి ఈ సహాయ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం నవ చైతన్య యువజన సంఘం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సాగర్, వినయ్, సంతోష్, వినయ్, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.








