![]()
గుంతలు తీశారు పూడ్చటం మరిచారు.
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్ జూన్ 14
టేకులపల్లి,తెలంగాణలో హరితహారం లో భాగంగా మొక్కలు నాటడం కోసం తీసిన గుంతలు పూడ్చకుండా వదిలివేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం చింతలంక గ్రామపంచాయతీ పరిధిలో కొత్తగూడెం -ఇల్లందు రహదారి పక్కన చోటుచేసుకుంది.
మొక్కలు నాటుట కొరకు తీసిన గుంతలు నెలల తరబడిగా ఖాళీగా ఉండటం వల్ల ప్రమాదకరంగా మారాయి. రహదారి పక్కన పూడ్చని గుంతల కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులు, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
పాదచారులు పొరాత్రి వేళల్లో ప్రమాదవశాత్తూ ఈ గుంతల్లో పడి గాయాలపాలవుతున్నారు.
ఖాళీగా ఉన్న గుంతలు పాములు, తేళ్లు లాంటి విషపురుగులకు ఆవాసాలుగా మారుతున్నాయి.
గుంతలను వెంటనే పూడ్చివేయాలని స్థానిక ప్రజలు, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.








