![]()
జూన్ 19 పినపాక మండలం పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోంది. కరకగూడెం మండలంలోని రాళ్లవాగు పెద్దమ్మ తల్లి గుడి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కన్నాయిగూడెం గ్రామపంచాయతీకి చెందిన ఇండిపెండెంట్ ప్రజాప్రతినిధులు సర్పంచ్ కల్తీ విజయ్, ఉపసర్పంచ్ స్వర్ణలత, నలుగురు వార్డు సభ్యులతో పాటు 25 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. అదేవిధంగా బట్టుపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఆవుదొడ్డి శ్రీనివాస్, రామారావు మాటూరి, ఉప్పలి నాగేష్, మాటూరి బాబు తదితరులతో పాటు 15 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరి తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కొత్తగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, పినపాక నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ కరకగూడెం మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎర్ర సురేష్, ముఖ్య నాయకులు రాందాస్ నాయక్, జలగం కృష్ణ, గ్రామ పెద్దలు కోడెం నాగేశ్వరావు, ఓకే కేశవరావు, కలం లక్ష్మయ్య, కలం నాగేశ్వరావు, ఇరప బుచ్చయ్య, ఇరప వెంకటనరసయ్య, కలం నరసయ్య, కలం సాగర్, కలం సాంబమూర్తి, తోలం రమేష్, కోడెం రామారావు, ఓకే గణేష్ తదితరులు పాల్గొన్నారు..








