![]()
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
భద్రాచలం, జూన్ 17 (మన భద్రాద్రి న్యూస్):
భద్రాచలం పట్టణంలోని ఏఎంసీ కాలనీలో డేగల ప్రదీప్–పల్లవి దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నూతన గృహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి ఇంటిలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిరుపేద కుటుంబాల సొంతింటి కల సాకారమవుతోందని అన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
లబ్ధిదారుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
గృహప్రవేశం సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం డేగల ప్రదీప్–పల్లవి దంపతులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు.
తదనంతరం కాలనీవాసులతో ఎమ్మెల్యే ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రత్నం రమాకాంత్, గాడి విజయ్, వేముల అనిల్, కుటుంబ సభ్యులు, కాలనీవాసులు మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.








