![]()
ప్రతి రహదారికి సైడ్ మార్జిన్ తప్పనిసరి: ఎంపీవో వెంకటేశ్వరరావు
పినపాక
పినపాక మండలంలో గ్రామీణ రహదారుల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి రహదారికి సైడ్ మార్జిన్ తప్పనిసరిగా ఉండాలని ఎంపీవో వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పలు రహదారులకు సైడ్ మార్జిన్ లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని, డిప్యూటీ తహసిల్దార్ గోపాలకృష్ణతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం పలు రహదారులను పరిశీలించి, సైడ్ మార్జిన్ కల్పనపై చర్చించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులతో సమావేశమై సమస్యలపై చర్చించారు. గ్రామాల్లో రహదారులు సురక్షితంగా, దీర్ఘకాలికంగా ఉండేందుకు సైడ్ మార్జిన్ కీలకమని అధికారులు పేర్కొన్నారు. పనులు నాణ్యతగా, నిబంధనల ప్రకారం పూర్తిచేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు.







