![]()
తేది: 15-06-2026 పినపాక మండలం మన భద్రాద్రి న్యూస్ : పినపాక నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సీతంపేట గ్రామపంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.గ్రామంలోని ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలలో రూ.16 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే, గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అదేవిధంగా, చిన్నారులకు మెరుగైన విద్యా మరియు పోషకాహార వాతావరణం కల్పించేందుకు రూ.2.50 లక్షల వ్యయంతో పునర్నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. ఈ భవనం ద్వారా గ్రామంలోని చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, రహదారుల నిర్మాణం, విద్యా మరియు సంక్షేమ రంగాల బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.సీతంపేట గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎమ్మార్వో, ఎంఫీవో, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








