![]()
పీవీ కాలనీ విషాదం..
రహదారి వెంబడి ఆవుల పోట్లాటలో సింగరేణి ఆపరేటర్ తల్లి మృతి..
మణుగూరు, మన భద్రాద్రి, జూన్ 9:
సింగరేణి కార్మికులు నివాసం ఉండే పీవీ కాలనీలో విషాదం నెలకొన్నది మంగళవారం ఉదయం ఆవుల కొట్లాటలో సింగరేణి ఆపరేటర్ చింతల శ్రీనివాస్ తల్లి చింతల ఎల్లమ్మ(80) మృతి చెందారు మణుగూరు సింగరేణి ఏరియా ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ 2 ఏ రిలే లో ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న చింతల శ్రీనివాస్ తల్లి చింతల ఎల్లమ్మ తన స్వస్థలమైన ఇల్లందు ఏరియా కు వెళ్ళేందుకు తన కుమారుడి క్వార్టర్ నుంచి తెల్లవారు జామున ఏలూరు బస్ కోసం బస్ స్టాప్ దగ్గరికి వెళ్తుండగా కాలనీ రహదారి పై ఉన్న ఆవులు,ఎద్దులు ఒకటి పై ఒకటి పోట్లడుకుంటూ ఎదురుగా వస్తున్న ఎల్లమ్మ మీదకు వెళ్లి వాటి కొమ్ములతో ఆమె పై దాడి చేయడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందడం అత్యంత బాధాకరమైన సంఘటన అని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కార్మికులు, కార్మిక సంఘాల డిమాండ్ చేస్తున్నారు.బాంబే కాలనీ, సంత ఏరియా, సింగరేణి పాఠశాల మరియు కమ్యూనిటీ హాల్ ఏరియాల క్వార్టర్ ల మధ్య, రహదారి పై విచ్చల విడిగా ఆవులు తిరుగుతున్నాయని వాటి వల్ల కార్మిక కుటుంబాలకు ప్రమాదాలు పొంచి ఉన్నాయని పరిష్కార మార్గం చూపాలని కార్మికులు ,కార్మిక సంఘాలు కోరుతున్నాయి








