![]()
పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జాన్ మిల్టన్ పిలుపునిచ్చారు.
ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్, ఈకో క్లబ్, యాంటీ డ్రగ్ కమిటీ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో మొక్కల నాటకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ జాన్ మిల్టన్ మాట్లాడుతూ, చెట్లు మనకు ప్రాణవాయువును అందించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయని అన్నారు. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో తప్పనిసరిగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు.
మై భారత్ పోర్టల్ జిల్లా కన్వీనర్ ఎం. వెంకట్ రాంబాబు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణతో పాటు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ హవీలా, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాధికారులు డాక్టర్ కిరణ్ కుమార్, బి. సుధాకర్ రావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.








