![]()
కేంద్రంలో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువయ్యేలా నూతన మెడ్ ప్లస్ మెడికల్ షాప్ బుధవారం ప్రారంభమైంది.చర్ల బస్ స్టాండ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఈ షాప్ ను భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,గిరిజన ప్రాంతమైన చర్లలో నాణ్యమైన మందులు సరసమైన ధరలకు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఇలాంటి ప్రైవేట్ సంస్థల సేవలు కూడా ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, చీమలమర్రి మురళీకృష్ణ, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.








