![]()
జర్నలిస్టుల పిల్లలకు 50శాతం ఫీజు రాయితీ తప్పని సరిగా అమలు చేయాలి -టీయూడబ్ల్యూజే(ఐజేయూ) పినపాక నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బర్ల జోషి
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50శాతం ఫీజు రాయితీ తప్పని సరిగా అమలు చేయాలని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) పినపాక నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బర్ల జోషి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో మండల విద్యావనరుల కేంద్రం లో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు జేవి రత్నం ఆదేశాల మేరకు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ప్రతినిధులు మండల విద్యాశాఖ అధికారి యెచు సింహారాజుకు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బర్ల జోషి మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలుకావాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టు కుటుంబానికి ఫీజు రాయితీ అందేలా విద్యాశాఖ పర్యవేక్షణ చేపట్టాలని కోరారు. వినతి పై స్పందించిన మండల విద్యాశాఖ అధికారి యెడు సింహారాజు ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేసేందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని తెలిపారు. త్వరలోనే మండలం లోని అన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, జర్నలిస్టుల పిల్లలకు 50శాతం ఫీజు రాయితీ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు డొంకన చంద్రశేఖర్, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ సహాయ కార్యదర్శి సాంబరెడ్డి, నియోజకవర్గ ఆర్గనైజింగ్ మెంబర్ నరసింహారెడ్డి, నియోజకవర్గ ఉపాధ్యక్షులు శివకుమార్, ఎలక్ట్రానిక్ మీడియా ఈసీ సభ్యులు రవి, సభ్యులు జక్కిరెడ్డి మల్లారెడ్డి, డి శ్రీనివాస్, కోటా రమేష్, రాంబాబు, చేతుల శ్రీనివాస్, సుధాకర్, ముజఫర్, కేసుపాక రాజు, తదితరులు పాల్గొన్నారు.








