![]()
తేదీ: 13-06-2026 మణుగూరు మండలం మన భద్రాద్రి న్యూస్ : అనారోగ్యంతో బాధపడుతున్న ఉప్పడి అనిత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా అనిత ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, ప్రస్తుతం అందుతున్న వైద్య చికిత్స వివరాలను పరిశీలించారు. అవసరమైతే మెరుగైన వైద్య సేవలు అందేలా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.అనారోగ్య సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే, అనిత త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ జీవితంలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు.ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉండడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.ప్రజల ఆరోగ్యం, సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, అవసరమైన సందర్భాల్లో ప్రజలకు అండగా నిలుస్తూ సేవలందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పిరినాకి నవీన్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు శివ సైదులు, మైనారిటీ విభాగం అధ్యక్షులు రహీం పాషా, కురం రవి, జిల్లా ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు.








