![]()
బూర్గంపాడు మండలం, మొరంపల్లి బంజర గ్రామపంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఆదివారం మేడం తిరుపాల్ రెడ్డి–కళావతి దంపతుల కుమారుడు తేజేశ్వర్ రెడ్డి, కీర్తిల రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బూర్గంపాడు మండల మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం ఆనందమయం, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడం లక్ష్మీనారాయణ రెడ్డి, బత్తుల రామకొండారెడ్డి, గంగుల చంద్రశేఖర్ రెడ్డి, దిగ్గిరెడ్డి బాలనారాయణరెడ్డి, రాఘవచారి, పేరం సుబ్బారెడ్డి, మాజీ వార్డు సభ్యులు కామిరెడ్డి పద్మ–సుబ్బారెడ్డి దంపతులు, మాజీ ఎంపీటీసీ తోటమళ్ల సరిత, సొసైటీ డైరెక్టర్ తోకల అనిత, మేడం రామకృష్ణారెడ్డి–మల్లీశ్వరి దంపతులు, మూల బాలిరెడ్డి, తిరుపతి ఎసుబు, సోము లక్ష్మీ చైతన్యరెడ్డి, చల్లకోటి పూర్ణచందర్, బెజ్జంకి కనకాచారి, శ్రీను, కర్రి నాగేశ్వరరావు, పంగి సురేష్, ఈశ్వర్, కనుకు సీతయ్య, ధనుగురి నాగేశ్వరరావు, బోరెం శ్రీను, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.








