![]()
ఈ నెల 30న నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభ విజయవంతానికి చేపడుతున్న ఏర్పాట్లను చింతకాని మండలంలోని సభా స్థలిలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా సభా ప్రాంగణం, పార్కింగ్, తాగునీటి సౌకర్యం, భద్రత, రవాణా ఏర్పాట్లతో పాటు రైతులకు కల్పిస్తున్న వసతులను అధికారులతో సమీక్షించారు. సభకు హాజరయ్యే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఎమ్మెల్యే రామ్‌దాస్ నాయక్, ఎమ్మెల్యే మట్టా రాగమయి తదితరులు పాల్గొన్నారు.





