![]()
ఇసుక లారీ డ్రైవర్లకు కౌన్సెలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు
– నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎస్సై టీవీఆర్ సూరి
మంగపేట, మన భద్రాద్రి న్యూస్, అక్టోబరు 9
ములుగు జిల్లా మంగపేట మండలంలోని ఇసుక క్వారీలకు చెందిన లారీ డ్రైవర్లకు ఎస్సై టీవీఆర్ సూరి ఆధ్వర్యంలో శుక్రవారం కౌన్సెలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. బ్రాహ్మణపల్లి చెక్‌పోస్టు వద్ద సీఐ రమణ్ బత్తు ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు.
మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగం, ఓవర్‌లోడ్‌తో ఇసుక తరలించరాదని డ్రైవర్లకు సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పలువురు డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.








