![]()
వైన్స్ దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల తనిఖీలు
పినపాక, మన భద్రాద్రి న్యూస్
పినపాక మండలం ఈబయ్యారం క్రాస్‌రోడ్డు ప్రాంతంలోని వైన్స్ దుకాణాలను ఎక్సైజ్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో విక్రయాల రికార్డులు, స్టాక్ వివరాలు, లైసెన్స్ పత్రాలను పరిశీలించారు. నిబంధనల ప్రకారం మద్యం విక్రయాలు జరుగుతున్నాయా లేదా అనే అంశంపై ఆరా తీశారు. అక్రమ నిల్వలు, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.








