![]()
అశ్వాపురం సీఐగా సిలువేరు ఎల్లయ్య పదవీ బాధ్యతలు…
అశ్వాపురం: అశ్వాపురం పోలీస్ స్టేషన్ నూతన సీఐగా సిలువేరు ఎల్లయ్య బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఐ ఎల్లయ్య మాట్లాడుతూ, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
అశ్వాపురం మండలంలో ప్రజా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








