![]()
బీర్సా ముండా 126వ వర్ధంతి
మన్య సీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ మండల అధ్యక్షులు తాటి నాగరాజు
మంగపేట జూన్ 09: మన భద్రాద్రి న్యూ
ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని మన్య సీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది భగవాన్ బీర్సా ముండా 126వ వర్ధంతి సందర్బంగా చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు ఈ సమావేశం లో మండల అధ్యక్షులు తాటి నాగరాజు మాట్లాడుతు ఆదివాసుల హక్కుల కోసం అగ్రాగన్యుడిగా నిలిచి బ్రిటిష్ వలసవాదంపై తిరుగు బాటు చేసి అతి చిన్న వయసు 25 సంవత్సరాలకే ఆదివాసీ హక్కులకై పోరాడి అసువులు బాసి అమరుడు అయిన బీర్సా ముండా 1897 ఆగస్టులో బీర్సా అతని నాలుగు వందల మంది సైనికులు బాణాలు విల్లులతో ఆయుదాలు ధరించి పోరాటం చేసిన మహా వీరుడు బీర్సా ముండాకు ఘన నివాళులు అర్పించినారు ఆదివాసీ అమరవీరులను స్మరించుకుంటూ వర్ధనతిలు జయంతిలు ప్రతి ఒక్క ఆదివాసీలు జరుపుకోవాలి ఇట్టి కార్యక్రమంలో మన్య సీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ మంగపేట మండల అధ్యక్షులు తాటి నాగరాజు, జిల్లా నాయకులు ఆక తిరుమలరావు, తాటి సునీలు పెద్దలు రాంబాబు జిల్లా నాయకులు తోలేం సౌమ్య, వాగబోయిన లావణ్య తదితరులు పాల్గొన్నారు








