![]()
గోదారమ్మ క్యాంపులో వీధి కుక్కలు సైర విహారం
మహిళల పై వృద్ధుల పై పిల్లల పై విరుచుకుపడుతున్న వీధి కుక్కలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక మేజర్ గ్రామపంచాయతీలో వీధి కుక్కలు కోతులు వీధుల్లో సైర విహారం చేస్తున్నాయి చేతిలో కవర్ పట్టుకొని బయటకు వెళ్లడం పాపం కుక్కలు, కోతులు, మనుషులపై ఎగబడుతున్నాయి. వాటిని గద్దించే క్రమంలో మనుషులపై దాడి చేస్తూ కరుస్తున్నాయి. గోదారమ్మ క్యాంపులో గత వారం రోజుల క్రితం నలుగురిని వీధి కుక్కలు కరవగా ప్రస్తుతం ఈరోజు కూడా ఒక మహిళపై దాడి చేసి కరిచాయి. పాలకవర్గ సభ్యులు గ్రామసభలో తీర్మానం చేసిన విధంగా వీధి కుక్కలను కోతులను త్వరగా గ్రామాల్లో లేకుండా చర్యలు చేపట్టాలని మేజర్ గ్రామపంచాయతీ ప్రజలు కోరుతున్నారు.








